This was something I wrote after a conversation with a friend in college.. she wanted to say all this to someone but never could.. babes.. this is dedicated to you!
ప్రతి క్షణం నీ పేరునే పలుకుతూ
ప్రతి నిమిషం నిన్నే కలవరిస్తూ
ప్రతి మనిషిలో నిన్నే చూస్తూ
ప్రతి దారిలో నిన్నే వెతుకుతున్నా
నా ప్రతి శ్వాస నీకంకితం
నా ప్రతి పలుకు నీ కోసం
నా ప్రతి అడుగు నిన్ను చేరుతుందని నమ్మకం
నా ప్రతి తలపులో నీ జ్ఞాపకం
ఎలా చెప్పను నువ్వే నా ప్రాణమని
ఎలా చెప్పను నీ పైనే నా ధ్యానమని
ఎలా చెప్పను నువ్వంటే అభిమానమని
నువ్వు నా కోసమే పుట్టావని, అనుమానమని
నువ్వు దూరమవుతావని భయంగా ఉన్నా
నీ మనసులో నే లేనని తెలుసుకున్నా
నీ స్నేహమే నే కోరుతున్నా
నువ్వు నవ్వుతావని తెలిసినా ఇలా రాస్తున్నా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment